Pages

Saturday, February 18, 2017

సైఫ్ అలీఖాన్ కుమార్తె ఎంట్రీ ఫిక్స్ అంటున్న ధర్మ ప్రొడక్షన్

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ఎంట్రీ విష‌య‌మై రెండేళ్లుగా వార్తలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎట్టకేల‌కు సారా ఎంట్రీ పై అధికారిక ప్రక‌ట‌న వ‌చ్చేసింది. `స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్` చిత్రానికి సీక్వెల్ గా తెర‌కెక్కనున్న సినిమా ద్వారా సారా తెర‌కు ప‌రిచ‌యం అవుతుంది. ఇందులో టైగ‌ర్ ష్రాఫ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. తొలుత ఈ పాత్ర కోసం దిశా పాట్నీని తీసుకున్నారు. అయితే ఆమె అనివార్య కార‌ణాల వ‌ల్ల వైదొల‌గ‌డంతో సారాను తీసుకుంటున్నట్లు ధ‌ర్మా ప్రొడ‌క్షన్స్ తెలిపింది.

దీంతో సారా స్నేహితులు శుభాకాంక్షలు తెలియ‌జేశారు. సినిమా రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. అలాగే తండ్రి సైఫ్ అలీఖాన్ కూడా సారా ఎంట్రీ పై ఆనందం వ్యక్తం చేశారు. సారా ఎంట్రీ విష‌య‌మై త‌న‌తో చాలా విష‌యాలు డిస్కస్ చేశా. కొన్ని స‌ల‌హాలు కూడా ఇచ్చాన‌ని` సైఫ్ తెలిపారు.

No comments:

Post a Comment