Pages

Friday, February 24, 2017

పూరి డైరెక్షన్ లో బాలయ్య 101 సినిమా

పూరి ...పూరి జగన్నాధ్ ఈ పేరు వింటే  సినిమా జీవితంలో  ఎవరికీ కొత్తగా  చెప్ప నవసరం లేదు .పూరి సినిమాలను చూస్తే హీరోలను  చాలా  విచిత్రంగా చూపిస్తాడు ...పూరి ఫస్ట్ సినిమా
పవన్ కళ్యాణ్ ని బద్రి లో చాలా డిఫరెంట్ గా చూపించాడు ..నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ అనే డైలాగ్ మనం మరచిపోలేము ..తరువాత రవితేజ తో. .సిటీ కి ఎంత మంది .......వచ్చినా చంటి గాడు లోకల్ ...
ఇలా పూరి ప్రతి సినిమా లో ఒక్కొక్క హీరోతో
ఒక్కో డైలాగ్ చేపించాడు ...ఇపుడు బాలకృష్ణ  తో ఎలా ఏం చూపిస్తాడో చుద్ద్దాం ....
తన 101 సినిమా ఎవరితో చేయాలనే దానిపై తర్జనభర్జన పడిన నందమూరి బాలకృష్ణ... ఫైనల్ గా ఆ ఛాన్స్ దర్శకుడు పూరి జగన్నాధ్ కు ఇచ్చేశాడు. ఈ సినిమా పూరి జగన్నాధ్ కన్ ఫామ్ చేయడంతో పాటు సెప్టెంబర్ 29న సినిమా రిలీజ్ ఉంటుందని కన్ ఫామ్ చేయడంతో... ఇక సినిమా షూటింగ్ మొదలవ్వడమే ఆలస్యమని విషయం అర్థమైంది. ఇదిలా ఉండే బాలయ్యతో పూరి ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే పూరికి దగ్గరగా ఉండే వారు చెబుతున్న దాని ప్రకారం... ఈ సినిమా స్టోరీ పోకిరి తరహాలో ఉంటుందట. అండర్ కవర్ పోలీస్ గా ఈ సినిమాలో బాలయ్య కనిపిస్తాడని సమాచారం....

Vinnar movie review



విన్నర్ (Winner) Cast & Crew: నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, వెన్నెల కిశోర్, అనసూయ త‌దిత‌రులుదర్శకుడు: గోపీచంద్ మలినేనిసంగీతం: థమన్. ఎస్. ఎస్నిర్మాత: నల్లమలుపు బుజ్జి, టాగోర్ మధు (లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్) Story: అయిదేళ్ల వయసులోనే తల్లితండ్రులకు అనుకోని పరిస్థితుల్లో దూరం అవుతాడు “రామ్” (సాయి ధరమ్ తేజ్). తరవాత హార్స్ రేస్ లో నష్టం ఎదురుకున్న “ధర్మేంద్ర” తన బాధ్యతల్ని తన కొడుకు “జగపతి బాబు” కు అప్పచెప్పుడం. జర్నలిస్ట్ రామ్ కు క్రీడాకారిణి “సితార” (రకుల్) తో పరిచయం ఏర్పడుతుంది. సితారను ప్రేమలోకి దించే ప్రయత్నం చేస్తుంటాడు “రామ్”. కానీ అనుకోని విధంగా “సితార” పెళ్లి విషయంలో ఆమె తండ్రి (సురేష్) ఒక నిర్ణయం తీసుకుంటాడు. సితార తండ్రితో “హార్స్ రేస్” గెలుస్తా అని పందెం కాస్తాడు “రామ్”. ఆ తరవాత “జగపతి బాబు” తో గొడవలు మొదలవుతాయి. చివరికి హార్స్ రేస్ లో గెలిచాడా? “సితార” ను పెళ్లి చేసుకోగలిగాడా? అనేది “విన్నర్” సినిమా Review: స్టోరీ పాతదే. కాకపోతే ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీ, ఫైట్స్, సాంగ్స్ తో సినిమాను ముందుకు నడిపించడానికి డైరెక్టర్ బాగా కష్టపడ్డాడు. విలన్ గా “జగపతి బాబు” మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. థమన్ అందించిన సంగీతం కూడా ఎంతో మందిని ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్, పెళ్లిచూపులు ప్రియదర్శి, పృథ్వి  కలిసి పండించిన కామెడీకి థియేటర్ లో నవ్వుకోలేక చావాల్సిందే. అనసూయ “సుయా సుయా” సాంగ్ కూడా ప్లస్ పాయింట్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ డాన్స్, ఫైట్స్ కూడా చాలా బాగున్నాయ్!