చిన్నప్పటి నుంచి నటనే శ్వాసగా ఎదిగిన నటుడు ఎన్టీఆర్. నటనే తన జీవితంగా భావించిన శ్రామికుడు. సరదాగా ఎంజాయ్ చేసే వయసులోనే కెమెరా ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు యంగ్ టైగర్. నూనూగు మీసాలప్పుడే తొడగొట్టి టాలీవుడ్ రికార్డ్స్ ని బ్రేక్ చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే కసి.. అదే పట్టుదల.. అదే నిబద్దత. అతనితో కలిసి ప్రయాణించిన ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా తెలుసు. ఇప్పుడు అతనితో కలిసి పనిచేస్తున్న డైరక్టర్ బాబీ కూడా ఆ విషయాన్నీ తెలుసుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో బాబీ ఎన్టీఆర్ 27 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రెండురోజుల క్రితం ప్రారంభమయింది. ఇందులో తారక పాల్గొనడం లేదు. దీనిపై డైరక్టర్ ఈరోజు క్లారిటీ ఇచ్చారు.“ఎన్టీఆర్ తోనే షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నాను. హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ తో కొన్నిరోజుల క్రితం మేకప్ టెస్ట్ చేయించాను. ఆయన ఎన్టీఆర్ ని కొత్తగా చూపించారు. ఆ లుక్ నాకు భలే నచ్చింది. ఆలా షూటింగ్ మొదలు పెడదామంటే తారక్ ఒప్పుకోలేదు” అని వివరించారు. “నా నుంచి అభిమానులు చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారు. అందుకే ఇంకా బాగా లుక్ రావాలి. అందుకోసం మరికొన్ని రోజులు ఎదురుచూస్తాను” అని ఎన్టీఆర్ చెప్పిన మాటలకు బాబీ ఫిదా అయిపోయారంట. మాటలే కాదు మరో క్యారక్టర్ అల్ట్రా స్టైలిష్ కుర్రాడి లుక్ కోసం తారక్ రోజూ హార్డ్ వర్క్ చేస్తున్నాడట. ఆ కమిట్మెంట్ చూసి ఎన్టీఆర్ కి బాబీ బిగ్ ఫ్యాన్ అయిపోయినట్లు సమాచారం.