Pages

Friday, February 24, 2017

పూరి డైరెక్షన్ లో బాలయ్య 101 సినిమా

పూరి ...పూరి జగన్నాధ్ ఈ పేరు వింటే  సినిమా జీవితంలో  ఎవరికీ కొత్తగా  చెప్ప నవసరం లేదు .పూరి సినిమాలను చూస్తే హీరోలను  చాలా  విచిత్రంగా చూపిస్తాడు ...పూరి ఫస్ట్ సినిమా
పవన్ కళ్యాణ్ ని బద్రి లో చాలా డిఫరెంట్ గా చూపించాడు ..నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ అనే డైలాగ్ మనం మరచిపోలేము ..తరువాత రవితేజ తో. .సిటీ కి ఎంత మంది .......వచ్చినా చంటి గాడు లోకల్ ...
ఇలా పూరి ప్రతి సినిమా లో ఒక్కొక్క హీరోతో
ఒక్కో డైలాగ్ చేపించాడు ...ఇపుడు బాలకృష్ణ  తో ఎలా ఏం చూపిస్తాడో చుద్ద్దాం ....
తన 101 సినిమా ఎవరితో చేయాలనే దానిపై తర్జనభర్జన పడిన నందమూరి బాలకృష్ణ... ఫైనల్ గా ఆ ఛాన్స్ దర్శకుడు పూరి జగన్నాధ్ కు ఇచ్చేశాడు. ఈ సినిమా పూరి జగన్నాధ్ కన్ ఫామ్ చేయడంతో పాటు సెప్టెంబర్ 29న సినిమా రిలీజ్ ఉంటుందని కన్ ఫామ్ చేయడంతో... ఇక సినిమా షూటింగ్ మొదలవ్వడమే ఆలస్యమని విషయం అర్థమైంది. ఇదిలా ఉండే బాలయ్యతో పూరి ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే పూరికి దగ్గరగా ఉండే వారు చెబుతున్న దాని ప్రకారం... ఈ సినిమా స్టోరీ పోకిరి తరహాలో ఉంటుందట. అండర్ కవర్ పోలీస్ గా ఈ సినిమాలో బాలయ్య కనిపిస్తాడని సమాచారం....

Vinnar movie review



విన్నర్ (Winner) Cast & Crew: నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, వెన్నెల కిశోర్, అనసూయ త‌దిత‌రులుదర్శకుడు: గోపీచంద్ మలినేనిసంగీతం: థమన్. ఎస్. ఎస్నిర్మాత: నల్లమలుపు బుజ్జి, టాగోర్ మధు (లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్) Story: అయిదేళ్ల వయసులోనే తల్లితండ్రులకు అనుకోని పరిస్థితుల్లో దూరం అవుతాడు “రామ్” (సాయి ధరమ్ తేజ్). తరవాత హార్స్ రేస్ లో నష్టం ఎదురుకున్న “ధర్మేంద్ర” తన బాధ్యతల్ని తన కొడుకు “జగపతి బాబు” కు అప్పచెప్పుడం. జర్నలిస్ట్ రామ్ కు క్రీడాకారిణి “సితార” (రకుల్) తో పరిచయం ఏర్పడుతుంది. సితారను ప్రేమలోకి దించే ప్రయత్నం చేస్తుంటాడు “రామ్”. కానీ అనుకోని విధంగా “సితార” పెళ్లి విషయంలో ఆమె తండ్రి (సురేష్) ఒక నిర్ణయం తీసుకుంటాడు. సితార తండ్రితో “హార్స్ రేస్” గెలుస్తా అని పందెం కాస్తాడు “రామ్”. ఆ తరవాత “జగపతి బాబు” తో గొడవలు మొదలవుతాయి. చివరికి హార్స్ రేస్ లో గెలిచాడా? “సితార” ను పెళ్లి చేసుకోగలిగాడా? అనేది “విన్నర్” సినిమా Review: స్టోరీ పాతదే. కాకపోతే ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీ, ఫైట్స్, సాంగ్స్ తో సినిమాను ముందుకు నడిపించడానికి డైరెక్టర్ బాగా కష్టపడ్డాడు. విలన్ గా “జగపతి బాబు” మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. థమన్ అందించిన సంగీతం కూడా ఎంతో మందిని ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్, పెళ్లిచూపులు ప్రియదర్శి, పృథ్వి  కలిసి పండించిన కామెడీకి థియేటర్ లో నవ్వుకోలేక చావాల్సిందే. అనసూయ “సుయా సుయా” సాంగ్ కూడా ప్లస్ పాయింట్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ డాన్స్, ఫైట్స్ కూడా చాలా బాగున్నాయ్!

Thursday, February 23, 2017

ఎన్టీఆర్ కి దాసోహమ్ అన్న డైరెక్టర్ బాబీ




చిన్నప్పటి నుంచి నటనే శ్వాసగా ఎదిగిన నటుడు ఎన్టీఆర్. నటనే తన జీవితంగా భావించిన శ్రామికుడు. సరదాగా ఎంజాయ్ చేసే వయసులోనే కెమెరా ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు యంగ్ టైగర్. నూనూగు మీసాలప్పుడే తొడగొట్టి టాలీవుడ్ రికార్డ్స్ ని బ్రేక్ చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే కసి.. అదే పట్టుదల.. అదే నిబద్దత. అతనితో కలిసి ప్రయాణించిన ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా తెలుసు. ఇప్పుడు అతనితో కలిసి పనిచేస్తున్న డైరక్టర్ బాబీ కూడా ఆ విషయాన్నీ తెలుసుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో బాబీ ఎన్టీఆర్ 27 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రెండురోజుల క్రితం ప్రారంభమయింది. ఇందులో తారక పాల్గొనడం లేదు. దీనిపై డైరక్టర్ ఈరోజు క్లారిటీ ఇచ్చారు.“ఎన్టీఆర్ తోనే షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నాను. హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ తో కొన్నిరోజుల క్రితం మేకప్ టెస్ట్ చేయించాను. ఆయన ఎన్టీఆర్ ని కొత్తగా చూపించారు. ఆ లుక్ నాకు భలే నచ్చింది. ఆలా షూటింగ్ మొదలు పెడదామంటే తారక్ ఒప్పుకోలేదు” అని వివరించారు. “నా నుంచి అభిమానులు చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారు. అందుకే ఇంకా బాగా లుక్ రావాలి. అందుకోసం మరికొన్ని రోజులు ఎదురుచూస్తాను” అని ఎన్టీఆర్ చెప్పిన మాటలకు బాబీ ఫిదా అయిపోయారంట. మాటలే కాదు మరో క్యారక్టర్ అల్ట్రా స్టైలిష్ కుర్రాడి లుక్ కోసం తారక్ రోజూ హార్డ్ వర్క్ చేస్తున్నాడట. ఆ కమిట్మెంట్ చూసి ఎన్టీఆర్ కి బాబీ బిగ్ ఫ్యాన్ అయిపోయినట్లు సమాచారం.

Saturday, February 18, 2017

సైఫ్ అలీఖాన్ కుమార్తె ఎంట్రీ ఫిక్స్ అంటున్న ధర్మ ప్రొడక్షన్

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ఎంట్రీ విష‌య‌మై రెండేళ్లుగా వార్తలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎట్టకేల‌కు సారా ఎంట్రీ పై అధికారిక ప్రక‌ట‌న వ‌చ్చేసింది. `స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్` చిత్రానికి సీక్వెల్ గా తెర‌కెక్కనున్న సినిమా ద్వారా సారా తెర‌కు ప‌రిచ‌యం అవుతుంది. ఇందులో టైగ‌ర్ ష్రాఫ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. తొలుత ఈ పాత్ర కోసం దిశా పాట్నీని తీసుకున్నారు. అయితే ఆమె అనివార్య కార‌ణాల వ‌ల్ల వైదొల‌గ‌డంతో సారాను తీసుకుంటున్నట్లు ధ‌ర్మా ప్రొడ‌క్షన్స్ తెలిపింది.

దీంతో సారా స్నేహితులు శుభాకాంక్షలు తెలియ‌జేశారు. సినిమా రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. అలాగే తండ్రి సైఫ్ అలీఖాన్ కూడా సారా ఎంట్రీ పై ఆనందం వ్యక్తం చేశారు. సారా ఎంట్రీ విష‌య‌మై త‌న‌తో చాలా విష‌యాలు డిస్కస్ చేశా. కొన్ని స‌ల‌హాలు కూడా ఇచ్చాన‌ని` సైఫ్ తెలిపారు.

Friday, February 17, 2017

Ghaji movie review


బ్యానర్‌:
 మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్‌, పివిపి సినిమాస్‌
తారాగణం: రానా దగ్గుబాటి, కెకె మీనన్‌, అతుల్‌ కులకర్ణి, తాప్సీ, రాహుల్‌ సింగ్‌, సత్యదేవ్‌, ఓంపురి, భరత్‌ రెడ్డి తదితరులు
మాటలు: గంగరాజు గుణ్ణం
కథనం: గంగరాజు గుణ్ణం, సంకల్ప్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి
కూర్పు: ఏ. శ్రీకర్‌ ప్రసాద్‌
సంగీతం: కె
ఛాయాగ్రహణం: మధి
నిర్మాతలు: ప్రసాద్‌ వి. పొట్లూరి, అన్వేష్‌ రెడ్డి, ఎన్‌.ఎమ్‌. పాషా, జగన్‌మోహన్‌ వంచా, వెంకటరమణా రెడ్డి
దర్శకత్వం: సంకల్ప్‌ రెడ్డి
విడుదల తేదీ: ఫిబ్రవరి 17, 2017
బాలీవుడ్‌లో జీవిత కథల్ని (ధోని, దంగల్‌), వాస్తవ ఘట్టాలని (నీరజ, ఎయిర్‌లిఫ్ట్‌, రుస్తుం) తెరకెక్కించడం ట్రెండ్‌ అయింది. ఇలాంటి వాటిని జనం కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత నావికా దళానికి చెందిన ఒక మిస్టరీని కథాంశంగా ఎంచుకున్నాడు దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి. 
భారత తూర్పు తీరంలో పాకిస్థాన్‌కి చెందిన సబ్‌మెరీన్‌ ఘాజీ అనుమానాస్పద రీతిలో ధ్వంసమైంది. అది ధ్వంసం కావడానికి అంతర్గత విస్పోటనం కారణమనేది పాకిస్థాన్‌ వెర్షన్‌ అయితే, భారతీయ నావికా దళమే దానిని ధ్వంసం చేసిందనేది మన వైపు కథనం. అసలేం జరిగిందనేది అంతు చిక్కని మిస్టరీ కాగా, ఘాజీ మన తూర్పు తీరంలోకి రావడం వెనుక మాత్రం భారీ కుట్రే వుందనేది భారతీయ నావికా దళం నమ్మకం. భారతీయ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ని ధ్వంసం చేయడానికి, విశాఖపట్నం పోర్టుని పేల్చివేయడానికి కుట్ర జరిగిందని ప్రచారంలో వుంది. ఘాజీ అనుమానాస్పదంగా ధ్వంసమై మునిగిపోయిన మిస్టరీ వెనుక 'అసలేం జరిగి ఉంటుంది?' అనే దానిని బేస్‌ చేసుకుని 'ఘాజీ' చిత్రం రూపొందింది. వాస్తవ సంఘటనకి కల్పిత కథని జోడించి చేసిన ఈ ప్రయత్నంలో కట్టి పడేసే అంశాలని నిక్షిప్తం చేయడంలొదర్శకుడుసంకల్ప్‌ విజయవంతమయ్యాడు. 
సినిమా మాత్రం హాలీవుడ్‌, విదేశీ చిత్రాల తరహాలో కథకి మాత్రమే కట్టుబడింది. ఎలాంటి డీవియేషన్స్‌ లేకుండా పూర్తిగా ప్లాట్‌ మీదే దృష్టి పెట్టింది. పూర్తి మేల్‌ కాస్ట్‌ అయిపోతుందని అనిపించడం వలనో ఏమో తాప్సీని ఎంటర్‌ చేసినట్టున్నారు కానీ ఆ క్యారెక్టర్‌ కూడా లేకుండా ఈ సినిమాని ఇంతే ఎఫెక్టివ్‌గా చూపించి ఉండొచ్చు. ఆ పాత్ర వల్ల కథకి ఒరిగిన ప్రయోజనం ఏమీ లేకపోగా, రెండు గంటల నిడివి వున్న చిత్రంలో దాదాపు తొంభై శాతం కథ సముద్ర గర్భంలో, సబ్‌మెరీన్‌లోనే నడుస్తుంది. లొకేషన్లు మారకుండా, సబ్‌మెరీన్‌ నుంచి బయటకి రాకుండా, శత్రువు ఎదురు పడకుండా లోపలే వుండి చేసే ఈ యుద్ధంతో కదలకుండా కూర్చోబెట్టడమనేది జోక్‌ కాదు. 
ఏమి తీస్తున్నాననే దానిపై దర్శకుడికి పూర్తి అవగాహన వుండాలి. అతి తక్కువ పాత్రల మధ్య జరిగే సంభాషణల్లో ప్రతి మాటా విలువైనదై వుండాలి. ప్రేక్షకులకి సబ్‌ మెరీన్‌లో కూర్చున్న అనుభూతిని ఇస్తూనే, సినిమా అంతా ఇరుకైన ప్రదేశంలో జరుగుతోందనే భావన రాకుండా సినిమాటోగ్రాఫర్‌ చూసుకోవాలి. సబ్‌మెరీన్ల గురించి వినడమే తప్ప చూసి వుండని జనమే అత్యధికులున్నపుడు వారికి ఆ లోపలి వాతావరణం ఎలాగుంటుంది, అసలు సబ్‌మెరీన్‌లో జీవనం ఎలా గడుస్తుందనే దానిపై అవగాహనని ఆర్ట్‌ డైరెక్టర్‌ ఇవ్వాలి. పట్టుమని అయిదారు ముఖ్య పాత్రలు లేని కథతో, సింగిల్‌ లొకేషన్‌కే ఫిక్స్‌ అయిన దాంతో ఆడియన్స్‌ని అరెస్ట్‌ చేయడానికి కావాల్సిన ఇంటెన్సిటీని మ్యూజిక్‌ డైరెక్టర్‌ తీసుకురాగలగాలి. ఏ విధంగా చూసినా అందరికీ పెద్ద సవాల్‌ అయిన 'ఘాజీ' చిత్రాన్ని సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దిన విధానానికి హేట్సాఫ్‌ చెప్పాలి. 
కొన్ని కథలు ఊహించుకోవడానికి బాగుంటాయి. కానీ ఎగ్జిక్యూట్‌ చేయడానికి గట్స్‌తో పాటు క్లారిటీ కావాలి.     పాత్రలు తక్కువ అవడం వల్ల ఆసక్తికరమైన పాత్రచిత్రణపై దృష్టి పెట్టాలి. అన్ని పాత్రలకీ నేపథ్యం వివరించే వీలుండదు కనుక సన్నివేశాల్లోనే ఆయా పాత్రలతో కనక్ట్‌ అవడానికి తగ్గట్టుగా వాటిని తీర్చిదిద్దాలి. తల పండిన దర్శకులకే తలకి మించిన పని అనిపించే దానిని యువ దర్శకుడు సంకల్ప్‌ తలకెత్తుకున్నాడు. అందుబాటులో వున్న వనరులతోనే 'సబ్‌మెరీన్‌ వార్‌'ని కళ్లకి కట్టాడు. సబ్‌మెరీన్‌ ఆపరేషన్స్‌కి సంబంధించిన విషయాలని అధ్యయనం చేసాడు. తన దగ్గరున్న ఇన్‌ఫర్మేషన్‌తో కథలో డ్రామా పండించడానికి అనువుగా సన్నివేశాలని మలచుకున్నాడు. అసలు 'యాక్షన్‌' మొదలయ్యే వరకు పాత్రల మధ్య సంఘర్షణతో సినిమాని రసవత్తరంగా నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. కెకె మీనన్‌, రానా మధ్య ఏది మంచి, ఏది కాదు... ఏది రూల్‌, ఏది కాదు అంటూ జరిగే వాదం కట్టి పడేస్తుంది. ఇద్దరిలో ఎవరి సైడ్‌ తీసుకోవాలనే కన్‌ఫ్యూజన్‌ వీక్షకులకి కూడా కలిగించేటట్టుగా ఎవరి కోణంలో వారు క్యారెక్టర్లు రెండూ కరక్ట్‌ అనిపిస్తుంటాయి. దాంతో వాళ్ల మధ్య సంఘర్షణ చక్కగా కుదిరింది. 
భారత సబ్‌మెరీన్‌ ఎస్‌ 21 నుంచి ఒకే ఒక్క టార్పిడో (శత్రువుల సబ్‌మెరీన్‌ని ధ్వంసం చేయడానికి వాడే మైన్‌లాంటి ఆయుధం) గమ్యం చేరుకోకపోగా, శత్రువుని అలర్ట్‌ చేస్తుంది. దాంతో వారి వ్యూహంలో భాగంగా ఇండియన్‌ సబ్‌మెరీన్‌ ప్రమాదానికి గురయి ఈజీ టార్గెట్‌ అయిపోతుంది. అలాంటి పరిస్థితిలోను రానా, తన బృందం ఏ విధంగా ఉన్న వనరులతోనే శత్రువు ఎత్తులని చిత్తు చేస్తారో, చివరిగా ఎలా వాళ్లని మట్టుబెడతారో అనేది ఉత్కంఠభరితంగా తెరకెక్కింది. సినిమా చూస్తున్నంతసేపు థియేటర్లో వున్నట్టు కాకుండా సబ్‌మెరీన్‌లోనే ఉన్న భావనని రేకెత్తించడంలో ఘాజీ బృందం పూర్తిగా విజయవంతమైంది. ప్రధాన పాత్రల్లో రానా, కెకె మీనన్‌ చక్కగా ఇమిడిపోయారు. ముఖ్యంగా మీనన్‌ నటన మెప్పిస్తుంది. 'సర్కార్‌' తర్వాత మళ్లీ అతనికి అంత ఎఫెక్టివ్‌ క్యారెక్టర్‌ ఇందులోనే దొరికింది. సపోర్టింగ్‌ రోల్స్‌లో అతుల్‌ కులకర్ణి, భరత్‌ రెడ్డి, సత్యదేవ్‌ (నేవీ సైనికుడి గెటప్‌కి తగ్గ లుక్‌ మెయింటైన్‌ చేయాల్సింది) తమవంతు బాధ్యత నిర్వర్తించారు. 
ఇలాంటి సాహసోపేత చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు అభినందనీయులు. వీళ్లు వేసిన తొలి అడుగు ఇకపై ఇలాంటి సాహసాలు చేయడానికి ఇతర నిర్మాతలలో ధైర్యం నింపుతుంది. లిమిటెడ్‌ అప్పీల్‌ ఉన్న సినిమా కావడంతో బాక్సాఫీస్‌ వద్ద అద్భుతాలు చేసినా చేయకపోయినా, తెలుగు సినిమా చరిత్రలో ఘాజీకో పేజీ వుండిపోతుంది. మరుగున పడిపోయిన ఒక చరిత్ర పుటలోని సంఘటనకి తెర రూపం ఇచ్చిన ఘాజీ రెండు గంటల పాటు కట్టి పడేయడమే కాకుండా గుండెల నిండా దేశభక్తిని నింపి, చివర్లో రెపరెపలాడే మువ్వన్నెల జెండాకి మనసు తీరా సెల్యూట్‌ చేయిస్తుంది.  

Monday, January 23, 2017

Golconda port history

     
        గొల్కోండ కోట రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి 11 కిలోమీటర్లదూరంలో ఉంది.ఈ ప్రాంతాన్ని క్రీ"శ 1083 నుండి 1323 వరకూ కాకతీయులు పరిపాలించారు. గోల్కోండ అసలుపేరు గొల్ల కొండ.దీనికి ఈ పేరు రావడానికి చిన్న కధ ఉంది.ఇక్కడ గొర్రెలు కాసుకునే గొర్రెలకాపరికి మంగళవారం అనే కొండపై దేవతావిగ్రహం కనపడిందంట.ఈ విషయాన్ని కాకతీయరాజులకు చెప్పగా ఇక్కడ మట్టితో ఒక కట్టడం నిర్మించారట.కాలక్రమంలో గొల్లకొండ గొల్కోండగా రూపాంతరం చెందింది.చాలాకాలంవరకూ ఇది కాకతీయుల అధీనంలో ఉండేది.అయితే యుధ్దసమయంలో సంధిలో భాగంగా 1371లో గోల్కోడ కోట అజీం హుమాయూన్ వశమయ్యింది.దీనితో ఈకోట మహ్మదీయిల చేతిలోనికి వెళ్ళింది.తరువాత కాలంలో అనేక రాజుల చేతులు మారి 15న శతాబ్ద సమయంలో కుతుబ్ షాహీ రాజుల చేతులోకి వెళ్ళగా వారు ఇక్కడ ఇప్పుడు మనకు కనిపించే నల్లరాతి కొటను కట్టించారు.తరువాత కుతుబ్ షాహీ వంశస్తులను ఔరంగజేబు జయించి ఈకోటను కొంతభాగం వరకూ నాశనం చేశాడు.దీనితో ఇక్కడ పాలన కాలగర్బంలో కలిసిపోయింది.
    ఈకోట ప్రస్తుతం ఎంతో చరిత్రను తనలో ఇడుమడింపచేసుకుని బావితరాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.ఈకోటను 120మీటర్లు ఎత్తుకలిగిన నల్లరాతికొండపై నిర్మించారు.గోల్కోండను శత్రువుల నుండి రక్షించుటకు దీనిచుట్టూ పెద్దబురుజును నిర్మించారు.ఇది 87 అర్దచంద్రకార బురుజులతో 10 కిలోమీటర్లు కొట చుట్టూ కట్టబడింది.ఈకోటలో నాలుగు ప్రధాన సిమ్హద్వారాలు,అనేక రాజమందిరాలు,దేవాలయాలు,మసీదులు కలవు.కోటలోనికి శత్రువులు ప్రవేశిచినపుడు పైవారికి సమాచారము చేరవేయుటకు ధ్వని శాస్త్రము అధారంగా అద్భుతంగా నిర్మించారు.ఇక్కడ నుండి చప్పట్లు కోడితే కిలోమీటరు దూరంలోని కోట లోపల ఉండే బాలా మిస్సారు వద్ద ఈ శబ్దం చాలా చక్కగా వినపడుతుంది.ఇక్కడనుండి కోటలోనికి చేరుకోవడానికి 380 రాతిమెట్లు కలవు.కొటలోనికి నీటిని అప్పటిలోనే ప్రత్యేక విధానం ద్వారా పైకి చేరవేసేవారట.ఈకొటలోనుండి నగరంలో ఉన్న చార్మినార్ కు గుర్రం పోయేటంత సొరంగమార్గం ఉందని ప్రచారంలో ఉంది.
    ఈ కోటలో కాకతీయులచే నిర్మించబడిన ప్రాచీన దేవాలయాలు కలవు.వీటిని పాతకాలం నాటి గండశీలతో నిర్మించారు.అంతే కాకుండా ఈ కోటలోనే శ్రీరామదాసుగా పిలువబడే కంచర్లగోపన్నను భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు తానిషా కారాగారంలో భందించాడు.ఈ కారాగారంలో రామదాసుచే గోడలపైన చెక్కబడిన సీతారామ,లక్ష్మణుల విగ్రహాలను చూడవచ్చు.హీందూ దేవాలయాలతో పాటు అనేక మసీదులు కూడా కలవు.
ఈ భావితరాలకోసం పరిరక్షించుటకు దీనిని పురావస్తుశాఖవారు రమ ఆధీనంలో పరిరక్షిస్తున్నారు.కోటను చూడటానికి ప్రతిరోజు ఎంతోమంది సందర్శకులు దేశ విదేశాలనుండి వస్తారు.వారి కోసం అలనాటి కోట విశేషాలు తెలియచెప్పే సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటుచేయబడుతుంది.దీనిని తెలుగు,హిందీ,ఇంగ్లీషు భాషల్లో ప్రదర్శిస్తున్నారు.
షో ప్రదర్శించు సమయాలు -
ఇది నవంబర్ నుండి ఫిబ్రవరి వరకూ సాయంత్రం 6.30కు మొదలవుతుంది.మార్చినుండి అక్టోబర్ వరకూ 7గంటలకు స్టార్ట్ అవుతుంది.ఈ షో మొత్తం 55ని"లు ఉంటుంది.
ఇంగ్లిషులో - బుధవారం మరియు ఆదివారం
హిందీలో - గురువారం,శుక్రవారం మరియు శనివారం
తెలుగులో -మంగళవారం
సోమవారం ప్రదర్శనకు సెలవు.

english

Golkonda Fort was first built by the Kakatiya dynasty as part of their western defenses along the lines of the Kondapalli Fort. The city and the fortress were built on a granite hill that is 120 meters (480 ft) high, surrounded by massive battlements. The fort was rebuilt and strengthened by Rani Rudrama Devi and her successor Prataparudra.[1][2] Later, the fort came under the control of the Musunuri Nayaks, who defeated the Tughlaqi army occupying Warangal. It was ceded by the Musunuri Kapaya Nayak to the Bahmani Sultanate as part of a treaty in 1364.
Under the Bahmani Sultanate, Golkonda slowly rose to prominence. Sultan Quli Qutb-ul-Mulk (r. 1487–1543), sent as a governor of Telangana, established it as the seat of his government around 1501. Bahmani rule gradually weakened during this period, and Sultan Quli formally became independent in 1538, establishing the Qutb Shahi dynasty based in Golkonda.Over a period of 62 years, the mud fort was expanded by the first three Qutb Shahi sultans into the present structure, a massive fortification of granite extending around 5 km in circumference. It remained the capital of the Qutb Shahi dynasty until 1590 when the capital was shifted to Hyderabad. The Qutb Shahis expanded the fort, whose 7 kilometres (4.3 mi) outer wall enclosed the city.
The fort finally fell into ruin in 1687, after a year long siege leading to its fall at the hands of the Mughal emperor Aurangzeb.

Diamonds

The Golkonda Fort used to have a vault where once the famous Koh-i-Noor and Hope diamonds were stored along with other diamonds.
Golkonda is renowned for the diamonds found on the south-east at Kollur Mine near Kollur, Guntur districtParitala and Atkur in Krishna district and cut in the city during the Kakatiya reign. At that time, India had the only known diamond mines in the world. Golkonda's mines yielded many diamonds. Golkonda was the market city of the diamond trade, and gems sold there came from a number of mines. The fortress-city within the walls was famous for diamond trade. However, Europeans believed that diamonds were found only in the fabled Golkonda mines. Magnificent diamonds were taken from the mines in the region surrounding Golkonda, including the Daria-i-Noor or "Sea of Light", at 185 carats (37.0 g), the largest and finest diamond of the crown jewels of Iran.
Its name has taken a generic meaning and has come to be associated with great wealth. Gemologists use this classification to denote a diamond with a complete (or almost-complete) lack of nitrogen; "Golconda" material is also referred to as "2A".
Many famed diamonds are believed to have been excavated from the mines of Golkonda, such as:
By the 1880s, "Golkonda" was being used generically by English speakers to refer to any particularly rich mine, and later to any source of great wealth.
During the Renaissance and the early modern eras, the name "Golkonda" acquired a legendary aura and became synonymous for vast wealth. The mines brought riches to the Qutb Shahis of Hyderabad State, who ruled Golkonda up to 1687, then to the Nizam of Hyderabad, who ruled after the independence from the Mughal Empire in 1724 until 1948, when the Indian integration of Hyderabad occurred.

The Fort


Fort overlooking the city of Hyderabad
Mosque of Ibrahim
The Baradari at the top of the citadel
View from the Baradari
Architecture inside golkonda fort
Streets in golkonda fort
The Baradari
The Golkonda fort is listed as an archaeological treasure on the official "List of Monuments" prepared by the Archaeological Survey of India under The Ancient Monuments and Archaeological Sites and Remains Act. Golkonda actually consists of four distinct forts with a 10 km long outer wall with 87 semicircular bastions (some still mounted with cannons), eight gateways, and four drawbridges, with a number of royal apartments and halls, templesmosques, magazines, stables, etc. inside. The lowest of these is the outermost enclosure into which we enter by the "Fateh Darwaza" (Victory gate, so called after Aurangzeb’s triumphant army marched in through this gate) studded with giant iron spikes (to prevent elephants from battering them down) near the south-eastern corner. At Fateh Darwaza can be experienced a fantastic acoustic effect, characteristic of the engineering marvels at Golkonda. A hand clap at a certain point below the dome at the entrance reverberates and can be heard clearly at the 'Bala Hisar' pavilion, the highest point almost a kilometer away. This worked as a warning note to the royals in case of an attack.
The whole of the Golkonda Fort complex and its surrounding spreads across 11 km of total area, and discovering its every nook is an arduous task. A visit to the fort reveals the architectural beauty in many of the pavilions, gates, entrances and domes. Divided into four district forts, the architectural valour still gleams in each of the apartments, halls, temples, mosques, and even stables. The graceful gardens of the fort may have lost their fragrance, for which they were known 400 years ago, yet a walk in these former gardens should be in your schedule when exploring the past glories of Golkonda Fort.
Bala Hissar Gate is the main entrance to the fort located on the eastern side. It has a pointed arch bordered by rows of scroll work. The spandrels have yalis and decorated roundels. The area above the door has peacocks with ornate tails flanking an ornamental arched niche. The granite block lintel below has sculpted yalis flanking a disc. The design of peacocks and lions is a blend of Hindu – Muslim architecture.
Toli Masjid, situated at Karwan, about 2 km from the Golkonda fort, was built in 1671 by Mir Musa Khan Mahaldar, royal architect of Abdullah Qutb Shah. The facade consists of five arches, each with lotus medallions in the spandrels. The central arch is slightly wider and more ornate. The mosque inside is divided into two halls, a transverse outer hall and an inner hall entered through triple arches.
Much thought went into building this gate. A few feet in front of the gate is a large wall. This prevented elephants and soldiers (during enemy attacks) from having a proper ramp to run and break the gate.
The fort of Golkonda is known for its magical acoustic system. The highest point of the fort is the "Bala Hissar", which is located a kilometer away. The palaces, factories, water supply system and the famous "Rahban" cannon, within the fort are some of the major attractions.
It is believed that there is a secret underground tunnel that leads from the "Durbar Hall" and ends in one of the palaces at the foot of the hill. The fort also contains the tombs of the Qutub Shahi kings. These tombs have Islamic architecture and are located about 1 km north of the outer wall of Golkonda. They are encircled by beautiful gardens and numerous exquisitely carved stones. It is also believed that there was a secret tunnel to Charminar.
The two individual pavilions on the outer side of Golkonda are also major attractions of the fort. It is built on a point which is quite rocky. The "Kala Mandir" is also located in the fort. It can be seen from the king's durbar (king's court) which was on top of the Golkonda Fort.
The other buildings found inside the fort are :
Habshi Kamans (Abyssian arches), Ashlah Khana, Taramati mosque, Ramadas Bandikhana, Camel stable, private chambers (kilwat), Mortuary bath, Nagina bagh, Ramasasa's kotha, Durbar hall, Ambar khana etc.
This majestic structure has beautiful palaces and an ingenious water supply system. Sadly, the unique architecture of the fort is now losing its charm.
The ventilation of the fort is absolutely fabulous having exotic designs. They were so intricately designed that cool breeze could reach the interiors of the fort, providing a respite from the heat of summer.
The Huge gates of the fort are decorated with large pointed iron spikes. These spikes prevented elephants from damaging the fort. The fort of Golkonda is encircled by an 11-km-long outer wall. This was built in order to fortify the fort.